
హైదరాబాద్ నగరాన్ని వర్షం మరోసారి ముంచెత్తింది. రెండు రోజుల క్రితం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురియగా, నేడు ఈదురుగాలులతో కూడిన వాన పడింది. ఉదయం నుంచి ఎండ దంచికొట్టగా, మధ్యాహ్నం వాతావరంణం చల్లబడింది. సాయంత్రం సమయానికి ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. ఈదురుగాలులు వీచడంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. చెట్లు నేలకొరిగాయి ఖైరతాబాద్, అమీర్ పేట, సోమాజిగూడ, పంజాగుట్ట, కూకట్ పల్లి, మియాపూర్ లో అలాగే పలు ఏరియాల్లో భారీ వర్షం కురిసింది.