కాజల్ భర్త ఇంకా పెళ్లి మూడ్ లోనే ఉన్నాడట !

హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ గత ఏడాది వివాహ బంధంలో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. జీవిత భాగస్వామితో తన కొత్త జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించక ముందే ఆచార్య షూటింగ్ లో పాల్గొంది కాజల్. సినిమాల పై మక్కువ కంటే కూడా, కాజల్ కి రెమ్యునరేషన్ పై ఇష్టమే ఎక్కువ అట. అందుకే పెళ్లి అయిన వారం రోజులకే, ఇంకా పెళ్లి మ‌ల్లెలు వాడ‌కముందే షూట్ కి రెడీ అయిపోయింది. అయితే విచిత్రంగా ఆమె భర్త మాత్రం ఇంకా […]

Written By: admin, Updated On : May 5, 2021 5:18 pm
Follow us on

హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ గత ఏడాది వివాహ బంధంలో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. జీవిత భాగస్వామితో తన కొత్త జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించక ముందే ఆచార్య షూటింగ్ లో పాల్గొంది కాజల్. సినిమాల పై మక్కువ కంటే కూడా, కాజల్ కి రెమ్యునరేషన్ పై ఇష్టమే ఎక్కువ అట. అందుకే పెళ్లి అయిన వారం రోజులకే, ఇంకా పెళ్లి మ‌ల్లెలు వాడ‌కముందే షూట్ కి రెడీ అయిపోయింది.

అయితే విచిత్రంగా ఆమె భర్త మాత్రం ఇంకా పెళ్లి తాలూకూ మూడ్ నుంచి బయటకు రాలేదు. అలాగే కాజల్ కుటుంబంతో పాటు బంధువులు, మిత్రులు కూడా ఇంకా తన పెళ్లి మూడ్ లోనే ఉన్నారని, తమ జంటను ఇంకా కొత్త జంటగానే ట్రీట్ చేస్తున్నారని, అదంతా కాజల్ కి చిరాగ్గా ఉందని తెగ ఫీల్ అయిపోతుంది చందమామ. ఆ మాటకొస్తే కాజల్ పెళ్లి అయిన వెంటనే పెళ్లినే ప‌ట్టించుకోకుండా సెట్స్‌ లో అడుగుపెట్టింది.

ఇక ఇప్పుడు పెళ్లి అయి నెలలు గడుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తో అందరూ ఇంటికే పరిమితం కావడంతో, కాజల్ కుటుంబ సభ్యులు ఇంకా పెళ్లి వేడుక తాలూకు ఆనందాలను ఇంకా ఆస్వాదించాలని ఆశ పడుతున్నారు. కాజల్ మాత్రం ఈ కరోనా సెకండ్ వేవ్ ను కూడా వాడుకోవడానికి ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం రెండు యాడ్స్ షూట్ లో పాల్గొనడానికి కాజల్ ఈ నెలలో పది రోజుల పాటు డేట్స్ ఇచ్చింది.

అయినా కొత్తగా పెళ్లి అయిన జంట ఎప్పుడెప్పుడు ఏకాంతంలోకి అడుగు పెడ‌తామా అని ఆరాట ప‌డుతుంటారు. అన్నిటికి అలాగే అందరికీ దూరంగా ఉండి, తమ జీవిత భాగ‌స్వామితో క‌లిసి కొంత కాలం ఒంటరిగా గ‌డుపుదామ‌ని ప్లాన్ చేసుకుంటారు. కానీ కాజ‌ల్ అగ‌ర్వాల్ మాత్రం షూటింగ్‌ల్లో పాల్గొనటానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది. ఏది ఏమైనా కాళ్ల పారాణి ఆర‌క ముందే పెళ్లి సంద‌డికి విరామం ఇచ్చిన బ్యూటీ నుండి ఇలాంటి ప్రవర్తనే ఉంటుంది మరి. ఆ భర్తే అర్ధం చేసుకుని ముందుకు పోవాలి.