https://oktelugu.com/

తెలంగాణ ప్రజలకు తీవ్ర హెచ్చరిక.. జాగ్రత్త

వచ్చే మూడు రోజుల్లో తెలంగాణకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న సాయంత్రానికి వాయుగుండగా మారిందని తెలిపింది. పశ్చిమ దిశగా కదిలి మరింత బలపడి ఇవాళ ఉదయం తీవ్ర వాయుగుండగా మారింది. ఉత్తర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గోపాల్ పూర్ కు 470 కిలోమీటర్ల తూర్పు- ఆగ్నేయ దిశలో, కళింగపట్నానికి తూర్పూ- ఈశాన్య దిశలో 540 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రాబోయే ఆరు గంటల్లో మరింత […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 25, 2021 / 05:29 PM IST
    Follow us on

    వచ్చే మూడు రోజుల్లో తెలంగాణకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న సాయంత్రానికి వాయుగుండగా మారిందని తెలిపింది. పశ్చిమ దిశగా కదిలి మరింత బలపడి ఇవాళ ఉదయం తీవ్ర వాయుగుండగా మారింది. ఉత్తర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గోపాల్ పూర్ కు 470 కిలోమీటర్ల తూర్పు- ఆగ్నేయ దిశలో, కళింగపట్నానికి తూర్పూ- ఈశాన్య దిశలో 540 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.

    రాబోయే ఆరు గంటల్లో మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉంది. పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తర ఆంధ్రా- మధ్య కళింగపట్నం దగ్గర ఆదివారం సాయంత్రం తీరం దాటే అవకాశాలున్నాయి. 27న ఈశాన్య, పరిసర తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నాయి. ఈ ఆవర్తనం ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతంలో పరిసర ప్రాంతాల్లో తదుపరి 24 గంటల్లో మరో అప్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

    ఆ అల్పపీడనం వాయువ్య దిశగా ప్రయాణించి 29 నాటికి పశ్చిమ బెంగాల్ తీరం దగ్గరికి చేరుకునే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇవాళ నుంచి మూడు రోజులు పాటు చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నాయని వివరించింది.