ISI agent India case : ఆపరేషన్ సిందూర్ తర్వాత కేంద్రం భారత్‌లోని పాకిస్తాన్ అనుకూల వ్యక్తులపై ఫోకస్ పెట్టింది. ఐఎస్‌ఐకి, ఉగ్రవాదులకు సహకరిస్తున్నవారిని టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్టు చేశారు. ఆమె తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాకిస్తాన్ అనుకూల కథనాలు ఇస్తుంది. భారత దేశపు మిలటరీ స్థావరాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్‌కు అందజేసిందని గుర్తించారు.
ఘటనా నేపథ్యం
పహల్గాం ఉగ్రవాద దాడిలో 26 మృతి చెందారు. దీంతో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో జ్యోతి పాక్ ఇన్‌ఫ్లుయెన్సర్లు, పీఐవోలతో కనెక్ట్ అయింది. ఆమె పాకిస్తాన్ పర్యటనల్లో ‘ఇండియన్ గర్ల్ ఇన్ పాకిస్తాన్’ వీడియోలు వైరల్ అయ్యాయి. డానిష్‌ను మే 13న భారత్ బహిష్కరించడం, రెండు రోజుల తర్వాత ఆమె అరెస్టు జరిగింది.
ఆధారాల గుర్తింపు..
ఆఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ సెక్షన్ 3, భారతీయ న్యాయ సంహిత 152 కింద కేసు. ల్యాప్‌టాప్, ఫోన్‌లలో సున్నిత డేటా లభించింది. వాట్సాప్, స్నాప్‌చాట్ ద్వారా పాక్ హ్యాండ్లర్లు ‘షకీర్’, ‘రానా షబాజ్’తో టచ్. ఆమె పాక్ ఇంటెలిజెన్స్‌ను ‘అసెట్’గా అభివృద్ధి చేశారని పోలీసులు. ఇతర ఇన్‌ఫ్లుయెన్సర్లు, ఒడిషా యూట్యూబర్ కూడా ఇన్వెస్టిగేషన్‌లో ఉన్నారు.
బెయిల్ తిరస్కరణ..
తాజాగా జ్యోతి మల్హోత్రా బెయిల్ కోసం హర్యానా–పంజాబ్ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు దానిని తిరస్కరించింది. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నందున జైలులో ఉంచాలని ఆదేశాలు. ఫోరెన్సిక్ విశ్లేషణ పూర్తి కావాలి. కుటుంబం ఫోన్లు తిరిగి ఇవ్వాలని ఆదేశించింది.
జ్యోతి మల్హోత్రా ఘటన డిజిటల్ యుగంలో ‘హైబ్రిడ్ వార్‌ఫేర్’ ఉదాహరణ. ఐఎస్‌ఐ ఇన్‌ఫ్లుయెన్సర్లను లోబడి ప్రచారం, ఇన్‌ఫో లీక్ చేస్తోంది. భారత ఏజెన్సీలు మరిన్ని అరెస్టులు చేస్తున్నాయి. సోషల్ మీడియా యూజర్లు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కేసు జాతీయ భద్రతకు కొత్త ఆందోళన కలిగిస్తోంది.