Harmanpreet Kaur ముంబై వేదికగా దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో టీ మీడియా భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ షఫాలి వర్మ (87), దీప్తి శర్మ(58), స్మృతి మందాన (45) అదరగొట్టడంతో టీమ్ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో.. ఏడు వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఖాఖా మూడు వికెట్లతో సత్తా చాటింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమ్ ఇండియా ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. తొలి వికెట్ కు స్మృతి, షఫాలి 103 పరుగులు జోడించారు. ఈ దశలో దక్షిణాఫ్రికా బౌలర్లు సత్తా చూపించారు. స్మృతి, షఫాలి వర్మ అవుట్ కావడంతో టీమ్ ఇండియా స్కోరు మందగించింది. సెమీ ఫైనల్ మ్యాచ్లో సెంచరీ చేసి అదరగొట్టిన జెమీమా రోడ్రిగ్స్(24) ఫైనల్ మ్యాచ్లో ఆ స్థాయిలో అడలేకపోయింది. కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ (20) కూడా త్వరగానే అవుట్ అయింది. చివర్లో రీఛాగోష్ (34) దుమ్మురేపింది..
ఫైనల్ మ్యాచ్లో 20 పరుగులు చేయడం ద్వారా టీమిండియా కెప్టెన్ కౌర్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ నాక్ ఔట్ టోర్నీలలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా రికార్డు సృష్టించింది. మొత్తం నాలుగు ఇన్నింగ్స్లలో కౌర్ ఏకంగా 331 పరుగులు చేసింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. రెండవ స్థానంలో బెలిందా క్లార్క్ ఉంది. ఈమె ఆరు ఇన్నింగ్స్ లలో 330 పరుగులు చేసింది. మూడో స్థానంలో హీలి కొనసాగుతోంది. ఈమె నాలుగు ఇన్నింగ్స్ లలో 309 పరుగులు చేసింది. నాలుగో స్థానంలో బ్రాంట్ కొనసాగుతోంది. ఈమె ఐదు ఇన్నింగ్స్ లలో 281 పరుగులు చేసింది. 5వ స్థానంలో హాకీలీ కొనసాగుతోంది. ఈమె ఐదు ఇన్నింగ్స్ లలో 240 పరుగులు చేసింది.
ప్రస్తుత ప్రపంచ కప్ లో కౌర్ టీమిండియాలో అద్భుతంగా ముందుకు తీసుకుపోయింది. లీగ్ దశలో తొలి రెండు మ్యాచ్ లలో టీమ్ ఇండియా గెలిచింది. అయితే ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయింది. ఈ దశలో ఎంతో కీలకమైన మ్యాచ్లో విజయం సాధించింది. తద్వారా సెమీఫైనల్ దాకా వెళ్ళింది. సెమీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఆస్ట్రేలియా జట్టుపై అద్భుతమైన విజయాన్ని సాధించింది. తద్వారా ఫైనల్ వెళ్లిపోయింది.
సొంత దేశంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో టీమిండియా మీద అభిమానులకు విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టుగానే ప్లేయర్లు ఆడారు. 300 మించి స్కోర్ చేస్తారు అనుకున్నప్పటికీ.. మధ్యలో కొన్ని కీలక వికెట్లు కోల్పోవడంతో టీమిండియా 300 స్కోర్ చేయలేకపోయింది.. అయినప్పటికీ ఈ పిచ్ మీద ఫైటింగ్ స్కోర్ చేయగలిగింది.