Homeఎంటర్టైన్మెంట్Euphoria Twitter talk : ఒక్క VFX షాట్ కూడా లేకుండా గుణశేఖర్ మ్యాజిక్.. 'యూఫోరియా'...

Euphoria Twitter talk : ఒక్క VFX షాట్ కూడా లేకుండా గుణశేఖర్ మ్యాజిక్.. ‘యూఫోరియా’ మూవీ ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?

Euphoria Twitter talk : ‘చూడాలని ఉంది’, ‘ఒక్కడు’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ ని టాలీవుడ్ కి అందించిన డైరెక్టర్ గుణశేఖర్(Guna Shekar), ఈమధ్య కాలంలో సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఆయన గత చిత్రం ‘శాకుంతలం’ కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. డైరెక్టర్ గా గుణశేఖర్ బ్రాండ్ కి దెబ్బ పడడమే కాకుండా, నిర్మాతగా కూడా ఆయనకు బోలెడంత ఆర్ధిక నష్టాలను మిగిలించేలా చేసింది ఈ చిత్రం. అలాంటి సినిమా తర్వాత ఇక గుణ శేఖర్ కోలుకోవడం కష్టమే అని అనుకున్నారు. కానీ సినిమాలకు అలవాటు పడిన ప్రాణం, చివరి శ్వాస వరకు సినిమాలను తీస్తూనే ఉంటారు అని పెద్దలు అంటుంటారు. గుణ శేఖర్ కూడా లాంటి దర్శకుడే. తనపై ఏ మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ‘యూఫోరియా'(Euphoria Movie) అనే చిత్రం చేశాడు. ఈ చిత్రానికి కూడా దర్శకుడు ఆయనే, నిర్మాత కూడా ఆయనే.

ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ భూమిక, ‘ధురంధర్’ హీరోయిన్ సరా అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, విగ్నేష్ గవిరెడ్డి, నాజర్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది?, ట్విట్టర్ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ చిత్రానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో ఒక్కటంటే ఒక్క VFX షాట్ ని కూడా వాడలేదు అట, ఇంటర్వ్యూస్ లో గుణశేఖర్ ప్రత్యేకంగా ఈ విషయం గురించి చెప్పుకొచ్చాడు.

కథ:

ఇక సినిమా కథ విషయానికి వస్తే సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్న చైత్ర (సారా అర్జున్) అనే అమ్మాయి ఒక రోజు పబ్బుకి వెళ్ళినప్పుడు తనకు ఒక 5 మంది అబ్బాయిలు పరిచయం అవుతారు. ముందుగా ఆ అమ్మాయితో స్నేహం నటించి, తర్వాత ఒక కారులో తీసుకెళ్లి అత్యాచారం చేస్తారు. ఈ విషయాన్నీ దాచుకోకుండా తన తల్లదండ్రులకు చెప్పడమే కాకుండా, ధైర్యం చేసి పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తుంది. ఆమె మైనర్ కాబట్టి, ఆమెపై అత్యాచారం చేయడం తీవ్రమైన చర్యగా భావిస్తూ, పోలీసులు పోక్సో చట్టం క్రింద కేసుని నమోదు చేసి ఆ కుర్రాళ్లను అరెస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఎంతంటే ఆ 5 మంది కుర్రాళ్ళు కూడా మైనర్లే. అందులోనూ సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులకు సంబంధించిన పిల్లలు వీళ్ళు. వారిలో ప్రముఖ విద్యా సంస్థల ప్రిన్సిపల్ వింధ్య వేములపల్లి(భూమిక) కొడుకు వికాస్(విగ్నేష్ గవిరెడ్డి) కూడా ఉంటాడు. ఇక ఆ తర్వాత వచ్చే ట్విస్టులు, స్క్రీన్ ప్లే చాలా ఆసక్తి కరం గా ఉంటుంది.

ట్విట్టర్ టాక్:

ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచం లో యువత లో కొంతమంది విచ్చలవిడి తనని, మాలకద్రవ్యాలకు బానిసలూ అయ్యి, ఆ మత్తులో చేసే అకృత్యాలని, ఆ తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయి వంటి అంశాలను డైరెక్టర్ గుణశేఖర్ ఈ చిత్రంలో అద్భుతంగా చూపించాడని సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు చెప్తున్నారు. సమాజం లో జరిగే యదార్ధ సంఘటనలను ఆధారంగా తీసుకొనే గుణ శేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ముఖ్యంగా ఈ చిత్రం లో వచ్చే డైలాగ్స్, భూమిక మరియు ఆమె కొడుకు మధ్య వచ్చే సంభాషలు ప్రేక్షకులను ఆలోచింపజేసే విధంగా ఉన్నాయని అంటున్నారు. ఓవరాల్ గా సినిమా చాలా బాగుందని, ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా గ్రిప్పింగ్ గా ఉందని, ముఖ్యంగా యువత కచ్చితంగా చూడాల్సిన సినిమా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది గుణ శేఖర్ కం బ్యాక్ సినిమా. కచ్చితంగా థియేటర్స్ లో చూడదగ్గ సినిమా అని అంటున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular