
టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ లో అద్భుత ప్రదర్శన కనబర్చి సిల్వర్ మెడల్ గెలిచిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనా పటేల్ కు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అభినందనలు తెలియజేశారు. ఆమె సాధించిన విజయానికి బహుమానంగా భారీ నజరానా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని దివ్యాంగ్ ఖేల్ ప్రతిభా ప్రోత్సాహన్ పురస్కార్ యోజన కింద రూ. 3 కోట్లు భవీనా పటేల్ కు నజరానాగా అందజేయనున్నట్లు వెల్లడించారు.