
గ్రూప్-1 అభ్యర్థుల పరీక్షల కేసు తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వులో పెట్టింది. అభ్యర్థుల మెయిన్స్ పేపర్ కరెక్షన్ ను ప్రైవేట్ ఏజన్సీ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు చేయాల్సిన పనిని ప్రైవేట్ సంస్థ టీసీఎస్ చేయడం సరికాదని పిటిషనర్లు పేర్కొన్నారు. దీంతో ఇరువర్గాల వాదనలు పూర్తయ్యాయి. తమ తీర్పును హైకోర్టు రిజర్వ చేసింది.