
కరోనాపై పోరాటంలో వైద్య సిబ్బంది సేవలు మరువలేనివని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం ఆయన బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఏటా నిర్వహిస్తున్న ప్రపంచ వెసాక్ వేడుకల్లో కీలకోపన్యాసం చేశారు. బౌద్ధమత స్థాపకుడైన గౌతమ్ బుద్ధుడి పుట్టిన రోజు సందర్భంగా బుద్ధ పూర్ణిమ జరుపుకుంటారు. దీన్ని ట్రీపుల్- బ్లెస్డే డే గానూ పరిగణిస్తారు. ఈ క్రమంలో అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్యతో కలిసి కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. కరోనా మహమ్మారి సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి నిత్యం నిస్వార్థంగా సేవలందిస్తున్న ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స, వైద్యులు, నర్సులకు వందనం చేస్తున్నానన్నారు.