
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల సమయంలో కరోనా బారిన పడటంతో ఒక యాంటీబాడీ కాక్ టెయిల్ ఔషధాన్ని వాడారు. ఆ తర్వాత ఆయన వేగంగా కోలుకున్నారు. తాజాగా ఇప్పుడు ఔషధం భారత్ లో అందుబాటులోకి రానుంది. స్విట్జర్లాండ్ కు చెందిన ఔషధ తయారీ సంస్థ రోచ్ కు భారత్ లోని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి అనుమతులు లభించాయి. ప్రస్తుతానికి దీన్ని దిగుమతి చేసుకొని విక్రయించనున్నారు. సిప్లా కంపెనీ భారత్ లోదీని మార్కెటింగ్, పంపిణీ వ్యవహారాలను చూడనుంది.