
హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ భవనంలోని రాష్ట్ర డేటా కేంద్రం (ఎస్డీసీ) లో కొత్త యూపీఎస్ యూనిట్ ఏర్పాటు దృష్ట్యా ఈనెల 9వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 11న రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రభుత్వ వెబ్ సైట్లుకు అంతరాయం కలగనుంది. ఆ రెండు రోజులు ప్రభుత్వ పరమైన ఆన్ లైన్ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ కావు. డేటా కేంద్రం ద్వారా ప్రస్తుతం ప్రభుత్వ వెబ్ సైట్లు ఆన్ లైన్ సేవలు నడుస్తున్నాయి.