
టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తన జియో ఫోన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా విపత్తు సమయంలో ఉచిత ఔట్ గోయింగ్ కాల్స్ ను అందించనున్నట్లు ప్రకటించింది. కరోనా విపత్తు ముగిసేవరకు నెలకు 300 నిమిషాల ఉచిత ఔట్ గోయింగ్ కాల్స్ అందించడానికి రిలయన్స్ ఫౌండేషన్ తో కలిపి పనిచేస్తున్నట్లు రిలయన్స్ జియో శుక్రవారం తెలిపింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో రీఛార్జ్ చేయించుకోలేకపోయిన జియోఫోన్ వినియోగదారులకు ఈ పథకం అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.