CM Chandrababu: ఏపీ క్యాబినెట్ సమావేశంలో అన్న క్యాంటీన్ లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి మండల కేంద్రంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. నిర్వహణ, విరాళాలు, పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ వేయాలని సూచించారు. ఇప్పటి వరకు అన్న క్యాంటీన్లు కేవలం నగరాలు, పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాలకే పరిమితమయ్యాయి. ఇప్పడు మండల కేంద్రాల్లోనూ అందుబాటులోకి రానున్నాయి.