CM Revanth Reddy: మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి పీఏసీ సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలను ఇన్ ఛార్జ్ మంత్రులు పట్టించుకోవడం లేదన్నారు. నామినేటెడ్ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత అంతా మంత్రులదేనని అన్నారు. నిధులు , బాధ్యతలన్నీ వారి దగ్గరే ఉన్నాయని చెప్పారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం సిద్ధం కావాలని సూచించారు.