
చాలా దేశాలు కరోనాతో ఇబ్బందిపడుతుంటే ఆస్ట్రేలియా ఎలుకల దాడులతో బెంబేలెత్తిపోతుంది. ముఖ్యంగా న్యూ సౌత్ వేల్స్ లో వేల, లక్షల సంఖ్యలో ఎలుకలు పంటలపై, గ్రామాలపై దాడి చేసి భారీగా ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈ ఎలుకలతో ఏ కొత్త మహమ్మారి వస్తుందోనన్న భయంతో ప్రజలు, అధికారులు భయపడుతున్నారు. దీంతో భారత్ నుంచి ఎలుకలను చంపే బ్రొమాడియోలోన్ ను దిగుమతి చేసుకోవాలని ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది. ఈ ఎలుకల మందును గతంలో ఆస్ట్రేలియా నిషేధించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలుకల దాడిని ఆపడానికి ఆ నిషేధిత మందే విరుగుడుగా బావిస్తోంది. అందుకే 5 వేల లీటర్ల బ్రొమాడియోలోన్ ను భారత్ నుంచి దిగుమతి చేసుకోవాలని న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వం నిర్ణయించింది.