
కరోనా లక్షణాలు ఉన్న అందరికీ పరీక్షలు చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లాలో కొవిడ్ పై జిల్లా కలెక్టరెట్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా తీవ్రంగా ఉండడం వల్ల ప్రజల ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదని సీఎం కేసీఆర్ లాక్ డౌన్ పెట్టారు. లాక్ డౌన్ ఉన్నా వ్యవసాయానికి మినహాయింపు ఇచ్చారు. కాబట్టి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.