తిరుమలలో నేడు శ్రీవారికి ఇష్టమైన గరుడ వాహన సేవ జరగనుంది. ఈ నేపథ్యంలో తిరుపతి లో గరుడపక్షి ప్రత్యక్షమైంది. జిల్లా కోర్టు ఆవరణలో గరుడ పక్షి కనిపించింది. అరుదైన పక్షి అపస్మారక స్థితిలో కనపడటం వెంటనే అక్కడ వున్న లాయర్లు తిరుపతి అటవీ సిబ్బందికి సమాచారం చెరవేశారు. అటవీశాఖకు చెందిన శంకర్ గరుడ పక్షిని ఎస్వీ జూకు తరలించారు . వైద్యం అందించి కోలుకున్నాక శేషాచలంలో వదులుతామని ఫారెస్టు అధికారి తెలిపారు. తిరుమలలో గరుడసేవ రోజు గరుడ […]
తిరుమలలో నేడు శ్రీవారికి ఇష్టమైన గరుడ వాహన సేవ జరగనుంది. ఈ నేపథ్యంలో తిరుపతి లో గరుడపక్షి ప్రత్యక్షమైంది. జిల్లా కోర్టు ఆవరణలో గరుడ పక్షి కనిపించింది. అరుదైన పక్షి అపస్మారక స్థితిలో కనపడటం వెంటనే అక్కడ వున్న లాయర్లు తిరుపతి అటవీ సిబ్బందికి సమాచారం చెరవేశారు. అటవీశాఖకు చెందిన శంకర్ గరుడ పక్షిని ఎస్వీ జూకు తరలించారు . వైద్యం అందించి కోలుకున్నాక శేషాచలంలో వదులుతామని ఫారెస్టు అధికారి తెలిపారు. తిరుమలలో గరుడసేవ రోజు గరుడ పక్షి కనపడటం శ్రీవారి మహిమేనని స్థానికులు అంటున్నారు.