Allu Arjun vs Ram Charan vs NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటివరకు వచ్చిన సినిమాలు ఒక మోస్తారు విజయాలను సాధించాయి. దాంతో ఇకమీదట రాబోయే సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలవాలనే ఉద్దేశ్యంతోనే చాలామంది సినిమా మేకర్స్ కొత్త కథలతో సినిమాలను డిజైన్ చేస్తున్నారు. ఇక కొత్త కాన్సెప్ట్లతో వచ్చే సినిమాలకు ఎప్పుడు ఆదరణ దక్కుతుంది… టాప్ హీరోలుగా కొనసాగుతున్న అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటులు పాన్ ఇండియా బాట పట్టిన విషయం మనకు తెలిసిందే. పుష్ప సిరీస్ తో ఎనలేని గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీతో చేస్తున్న సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. రామ్ చరణ్ సైతం ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులందరికి సుపరిచితుడయ్యాడు. గ్లోబల్ స్టార్ గా అవతరించాడు. సినిమాతో సైతం బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన ఆయన ఇప్పుడు రాబోతున్న సినిమాలతో మరోసారి పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు…
ఇక ఈ ముగ్గురు హీరోల్లో ఎవరు టాప్ పొజిషన్ లో ఉన్నారు? ఎవరు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇంకా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఎవరి మార్కెట్ డౌన్ అయిపోయి ప్రమాదంలో ఉండబోతోంది అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం…
పుష్ప 2 సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టిన అల్లు అర్జున్ ప్రస్తుతం రామ్ చరణ్ ఎంటైర్ కంటే ముందు వరుస లో ఉన్నాడు. ఇక అట్లీ తో రాబోతున్న సినిమాతో సైతం పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతుండడం విశేషం…
రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమాతో 1300 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టాడు… అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా భాగమవ్వడం వల్ల ఇది ఇద్దరికీ దక్కిన క్రెడిట్ తప్ప ఒక్కరి వల్ల సాధ్యం కాలేదు అనే ధోరణిలో కూడా కొన్ని కామెంట్లు వస్తున్నాయి…ఈ ముగ్గురిలో రామ్ చరణ్ రెండో పొజిషన్లోనే కొనసాగుతూ ఉండటం విశేషం…
ఇక ఎన్టీఆర్ మూడో పొజిషన్ లో ఉన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అల్లు అర్జున్ ను ఢీ కొట్టాలంటే వీళ్లు మరింత పకడ్బందీ కథలతో రావాలి. అలాగే భారీ కలెక్షన్స్ కి కొల్లగొట్టగలిగే కెపాసిటి ఉండాలి. అవి ఉన్నప్పుడు మాత్రమే అతని రికార్డ్స్ బ్రేక్ చేయగలుగుతారు అంటూ కొంతమంది సినిమా విమర్శకులు సైతం కామెంట్లను చేస్తున్నారు. ఇక 2026వ సంవత్సరంలో హీరోలందరు వాళ్ళ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కాబట్టి ఈ ముగ్గురిలో ఎవరు టాప్ పొజిషన్ లో ఉంటారు అనేది తెలియాలంటే మరొక సంవత్సరం పాటు వెయిట్ చేయాల్సిందే…