
తాజాగా విరాట్ కోహ్లీ తీసుకున్నా నిర్ణయాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ తప్పుబట్టాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే బాగుండేదని అన్నాడు. కాగా వరల్డ్కప్ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు ఇటీవల ప్రకటించిన కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పకుంటనని ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనై చాలా మంది వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా గంబీర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కోహ్లీ అకస్మాత్తు ప్రకటన నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. అందుకు ఇది సరైన సమయం కాదు. కెప్టెన్ పదవి నుంచి వైదొలగడం, ఆటకు గుడ్ బై చెప్పడం అనేవి రెండు వేర్వేరు నిర్ణయాలు. కోహ్లీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. అయితే, ఇది ఆటగాళ్లను భావోద్వేగానికి గురిచేసే సమయం. ఏదేమైనా కోహ్లీ ఇప్పడు ఈ ప్రకటన చేయడం అస్సలు సరైనది కాదు. అని అన్నాడు. ఐపీఎల్ రెండో అంచె ప్రారంభానికి ముందు ఇలా చేయడమేమిటి? ఈ ప్రకటన అనవసరంగా ఆటగాళ్లపై ఒత్తిడిని పెంచుతుంది.
ఈసారి వాళ్లు మంచి పొషిషన్ లో ఉన్నారు. విరాట్ ఈ సీజన్ తర్వాత కెప్టెన్ గా ఉండడు కాబట్టి ఎలాగైన కప్ గెలవాలనే ఆశయం వారిపై ఆధిక భారాన్ని మోపుతుంది. ఓ వ్యక్తి కోసం కాదు.. ఫ్రాంచైజీ కోసం టైటిల్ గెలవాలి. ఈ విషయాన్ని కోహ్లీ గుర్తుపెట్టుకుంటే ఈ సమయంలో ఈ ప్రకటన చేసేవాడు కాదు అని విమర్శించాడు. కోహ్లీ కెప్టెన్సీలో ఆర్సీబీ 2015లో మూడో స్థానంలోనూ, 2016లో రన్నరప్ గా, 2020 లో నాలుగో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.