
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం కనిపిస్తోంది. రోజురోజుకీ పెరిగిపోతున్న కేసులు, మరణాలతో ఎక్కడ చూసినా విషాధ సంఘటనలే కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో నైటన్ కర్ఫ్యూ, పాక్షిక లాక్ డౌన్ ను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా గోవా ప్రభుత్వం రాష్ట్రంలో నేటి నుంచి 15 రోజుల పాటు పూర్తి కర్ఫ్యూను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అత్యవసర సేవలతో సంబంధం ఉన్న దుకాణాలకు మాత్రం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తెరుచుకునే అవాశం కల్పించారు.