
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇండియాలో అల్లకల్లోలం రేపుతోంది. దేశంలో కొత్తగా 4,03,738 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,22,96,414కి చేరింది. ఇందులో 1,83,17,404 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 37,36,648 కేసులు యాక్టీవ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 4,092 మంది మరణించారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 2,42,362కి చేరింది.