అక్రిడేషన్ ఉన్నా లేకున్నా కొవిడ్ బారిన పడిన జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యం అందించనున్నట్లు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ శుక్రవారం తెలిపారు. ఈ వారం ప్రారంభంలోనే చౌహన్ జర్నటిస్టులను కరోనా వారియర్స్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. జర్నలిస్టులు వారి విధులను నిర్వర్తించే క్రమంలో కొవిడ్ బారిన పడటం, కొందరు చనిపోవడం ఇటీవల మనం చూసిందేనని ఓ ప్రకటనలో సీఎం తెలిపారు. అయితే నేటి నుంచి అక్రిడేటెడ్, నాన్ అక్రిడేటెడ్ జర్నలిస్టులు కొవిడ్ కు గురైతే వారి సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం చెప్పారు.