
కరోనా కట్టడి విషయంలో దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే కేరళ కాస్త ముందంజలు ఉంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ పర్యవేక్షణలో అక్కడి అధికార యంత్రాంగం కష్టపడి పనిచేస్తూ బాధితులకు అండగా నిలబడుతోంది. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు కేరళలో సంపూర్ణ లాక్ డౌన్ అమలులో ఉంది. ఈ లాక్ డౌన్ సమయంలో ఎవరికీ ఆహార కొరత ఉండదని విజయన్ తెలిపారు. అన్ని కుటుంబాలకు ఉచితంగా ఫుడ్ కిట్స్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.