నలుగురు ఎమ్మెల్సీలను నామినేట్ చేశారు ఏపీ రాష్ట్ర గవర్నర్. ఈ మేరకు 2021 నోటిఫికేషన్ జారీ చేశారు. తోట త్రిమూర్తలు, మోషేస్ రాజు, అప్పిరెడ్డి, రమేశ్ లను ఎంపిక చేస్తున్నట్లు నోటిఫికేషన్ లో వెల్లడించారు. గవర్నర్ కోటాలో ఎన్నికైన టిడి జానార్దన్, బీద రవిచంద్ర, గౌవిగారి శ్రీనివాస్, పి. శమంతకమణిలకు జూన్ 11తో పదవీ కాలం ముగియగా వీరి స్థానంలో కొత్తగా మరో నలుగురు ఎమ్మెల్సీలు నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది.