Hari Hara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతున్న సందర్భంగా, నేడు మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్ ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు. కనీవినీ ఎరుగని రీతిలో సుమారుగా వందకి పైగా థియేటర్స్ లో ఈ ట్రైలర్ ని అభిమానుల కోసం ప్రదర్శించగా, వాళ్ళ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్ విడుదలకు ముందు ఒక సినిమా మీద ఎలాంటి నెగెటివ్ అభిప్రాయం జనాల్లో ఉండకూడదో, అలాంటి నెగటివ్ అభిప్రాయాలు ఈ చిత్రం పై ఉండేది. 5 ఏళ్ళ క్రితం మొదలు పెట్టిన సినిమా, అప్పటికీ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ లుక్స్ మారిపోయాయి, డైరెక్టర్ కూడా మారిపోయాడు, స్టోరీ లో మార్పులు వచ్చాయి , సరైన కంటెంట్ బయటకి రావడం లేదు , అభిమానుల్లో కూడా రోజురోజుకి ఆశలు సచ్చిపోతున్నాయి.
దానికి తోడు మూడు సార్లు ఈ ఏడాదిలో ఈ చిత్రం పోస్ట్ పోనే అవ్వడంతో దేవుడే ఈ చిత్రాన్ని కాపాడాలి అంటూ విశ్లేషకులు సైతం చెప్పుకొచ్చేవారు. కానీ నేడు విడుదల చేసిన ట్రైలర్ అందరి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. స్టోరీ పరంగా కానీ, క్వాలిటీ పరంగా కానీ, గ్రాండియర్ పరంగా కానీ ఈ చిత్రం వేరే లెవెల్ లో ఉండబోతుంది అనేది స్పష్టంగా అర్థం అవుతుంది. కేవలం అభిమానులు మాత్రమే కాదు, టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ ట్రైలర్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మెగా ఫ్యామిలీ నుండి వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి వారు ట్రైలర్ విడుదలైనప్పుడే వాళ్ళ రెస్పాన్స్ ని వినిపించారు. ఇక కాసేపటి క్రితమే మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) కూడా ఈ ట్రైలర్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ కొన్ని ట్వీట్స్ వేశారు.
Also Read: ఓజీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసేది అప్పుడేనా..? ట్రైలర్ వచ్చే డేట్ ను లాక్ చేసిన ప్రొడ్యూసర్…
ముందుగా చిరంజీవి మాట్లాడుతూ ‘ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. కళ్యాణ్ బాబు దాదాపుగా రెండున్నర ఏళ్ళ తర్వాత వెండితెర పై చూడబోతుండడం అభిమానులతో పాటు నాకు కూడా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ఈ మూవీ భారీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రామ్ చరణ్ మాట్లాడుతూ ‘ట్రైలర్ ని చూస్తుంటే చాలా గ్రాండియర్ గా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ని బిగ్ స్క్రీన్ మీద చూడడం మన అందరికి ఒక ట్రీట్ లాంటిది. ఈ సినిమా కమర్షియల్ గా భారీ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ వేసాడు. ఒకే సమయంలో చిరంజీవి, రామ్ చరణ్ ట్వీట్స్ వేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. అభిమానులు ఈ విషయం పై ఎంతో మురిసిపోతున్నారు. ఆ ట్వీట్స్ ని మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.