
ప్రముఖ కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా (89) కన్నుమూశారు. కరోనా బారినపడిన ఆయన చికిత్స పొందుతూ మరణించినట్లు హాస్పిటల్ వర్గాలు పేర్కొన్నాయి. పహాడియా 1980-81లో రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆ తర్వాత బిహార్, హర్యానా గవర్నర్ గా నూ సేవలందించారు. ఆయన మృతిపై రాజస్థాన్ సీఎం అశోఖ్ గహ్లాట్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కేబినేట్ సమావేశమై సంతాపం తెలుపునుంది. అధికారిక లాంఛనాలతో నేడు పహాడియా అంత్యక్రియాలు జరుగనున్నాయి.