మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కదలిక
మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ మళ్లీ ప్రారంభమయ్యింది. కేసు విచారణ నిమిత్తం ఆరుగురితో కూడిన సీబీఐ అధికారుల బృందం ఇప్పటికే కడప కేంద్రం కారాగారం అతిథి గృహానికి చేరుకున్నది. సుమారు ఏడు నెలల తర్వాత విచారణ తిరిగి ప్రారంభమయ్యింది. రెండేళ్ల క్రితం జరిగిన వివేకానందరెడ్డి హత్య కేసులో పలువురిని విచారించిన సీబీఐ గతేడాది కొందరిని విచారించింది. అయితే విచారణకు వచ్చిన అధికారుల్లో కొందరు కరోనా బారిన పడ్డారు. […]
Written By:
, Updated On : June 7, 2021 / 11:02 AM IST

మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ మళ్లీ ప్రారంభమయ్యింది. కేసు విచారణ నిమిత్తం ఆరుగురితో కూడిన సీబీఐ అధికారుల బృందం ఇప్పటికే కడప కేంద్రం కారాగారం అతిథి గృహానికి చేరుకున్నది. సుమారు ఏడు నెలల తర్వాత విచారణ తిరిగి ప్రారంభమయ్యింది. రెండేళ్ల క్రితం జరిగిన వివేకానందరెడ్డి హత్య కేసులో పలువురిని విచారించిన సీబీఐ గతేడాది కొందరిని విచారించింది. అయితే విచారణకు వచ్చిన అధికారుల్లో కొందరు కరోనా బారిన పడ్డారు. దీంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఏడు నెలల తరువాత మళ్లీ విచారణ జరిపేందుకు అధికారులు వచ్చారు.