
భారతీయ వైద్య సంఘం మాజీ అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కేకే అగర్వాల్ కరోనాపై సుదీర్ఘ పోరాటం అనంతరం కన్నుమూశారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. కరోనాతో ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన అగర్వాల్ కొన్నాళ్లుగా వెంటిలేటర్ పై ఉన్నారు. సోమవారం రాత్రి 11.30 గంటలకు అగర్వాల్ తుది శ్వాస విడిచినట్లు ఆయన ట్విట్టర్ హేండిల్ లో ఉంచిన ఒక ప్రకటన వెల్లడించింది. కరోనా కల్లోలంలో కూడా ఆయన జనాలకు చైతన్యపరిచేందుకు అనేక వీడియోలు, విద్యా కార్యక్రమాలు రూపొందించి విడుదల చేశారు.