
టీమ్ ఇండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్ తండ్రి శివప్రసాద్ సింగ్ కరోనా వైరస్ తో పోరాడుతూ బుధవారం కన్నుమూశారు. తన తండ్రి మరణించిన విషయాన్ని ఆర్పీ సింగ్ ట్విటర్లో వెల్లడించారు. నా తండ్రి శివప్రసాద్ సింగ్ కన్నుమూసిన విషయాన్ని తీవ్ర దుఖంతో తెలియజేస్తున్నాను. కొవిడ్ తో బాధపడుతూనే మే 12 న మమ్మల్నీ వదలి వెళ్లిపోయారు. నా తండ్రి అత్మకు శాంతి చేకూరేలా మీరంతా ఆ దేవుణ్ని ప్రార్థించాలని కోరుతున్నా.ఆర్ ఐపీ పాపా అంటూ సింగ్ ట్వీట్ చేశాడు. 2007 టీ 20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో ఆర్పీ కూడా ఉన్నాడు.