
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ (39) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి వర్గాల వెల్లడించాయి. కల్యాణ్ సింగ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నెల 4వ తేదీన ఆయన ఆరోగ్యం క్షీణించడంతో లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చేర్చారు. అప్పటి నుంచి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.