https://oktelugu.com/

ఆక్సిజన్ తరలిస్తున్న గూడ్సులో మంటలు

ఆక్సిజన్ ట్యాంకర్లు తరలిస్తున్న గూడ్స్ రైలులో మంటలు చెలరేగడం పెద్దపల్లి జిల్లాలో కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి రాయ్ పూర్ కు ఆరు ట్యాంకర్లతో వెళ్తున్న ఈ రైలులో ని ఒక ట్యాంకర్ లో కూనారం- చీకురాయి మధ్య అకస్మాత్తుగా మంటలు రేగాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగన బోగీని మిగతా బోగీల నుంచి విడగొట్టి దూరంగా తరలించారు. అయితే ఈ ప్రమాదానికి కారణాలేమిటనేది […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 29, 2021 / 12:52 PM IST
    Follow us on

    ఆక్సిజన్ ట్యాంకర్లు తరలిస్తున్న గూడ్స్ రైలులో మంటలు చెలరేగడం పెద్దపల్లి జిల్లాలో కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి రాయ్ పూర్ కు ఆరు ట్యాంకర్లతో వెళ్తున్న ఈ రైలులో ని ఒక ట్యాంకర్ లో కూనారం- చీకురాయి మధ్య అకస్మాత్తుగా మంటలు రేగాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగన బోగీని మిగతా బోగీల నుంచి విడగొట్టి దూరంగా తరలించారు. అయితే ఈ ప్రమాదానికి కారణాలేమిటనేది ఇంకా తెలియరాలేదు. పైన విద్యుత్ తీగలు ఉండటంతో అధికారులు ఉలిక్కిపడ్డారు.