
తెలంగాణలో ని జగిత్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ధర్మపురి మండలం కొసునూరుపల్లెలో రెండు వారాల వ్యవధిలో తండ్రికొడుకులు కరోనాతో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొసునూరుపల్లెకు చెందిన ఉట్కూరు హన్మంతరెడ్డి (75) కరోనా వల్ల పరిస్థితి విషమించి మరణించాడు. అలాగే వారం తరువాత కొడుకు గంగిరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందాడు.