
దేశంలో కలకలం సృష్టించిన ముంబాయి అత్యాచారం కేసుపై ఫాస్ట్ ట్రాక్ విచారణకు మహారాష్ట్ర సీఎం థాక్రే ఆదేశించారు. 34 ఏళ్ల యువతిపై దుండగుడు చేసిన దారుణం మరోసారి నిర్భయ ఘటనను గుర్తు చేసింది. మహిళపై అత్యాచారం చేయడంతో పాటు ప్రైవేటు భాగాలపై ఇనుపరాడ్డుతో దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. ఈ ఘటన మానవత్వానికే మాయని మచ్చగా సీఎం థాక్రే అభివర్ణించారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.