Telugu News » Ap » Family commits suicide by jumping in godavari
గోదావరిలో దూకి కుటుంబం ఆత్మహత్య
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట దగ్గర విషాదం చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు మండలం, మొగలికుదురు గ్రామానికి చెందిన సతీష్ కుటుంబం చించినాడ బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ ఘటన జూలై 30న జరిగితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో సతీష్ అతని భార్య సంధ్య, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మృతదేహాల కోసం గోదావరిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఒక మృతదేహం లభ్యంకాగా మిగిలిన మృతదేహాల […]
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట దగ్గర విషాదం చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు మండలం, మొగలికుదురు గ్రామానికి చెందిన సతీష్ కుటుంబం చించినాడ బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ ఘటన జూలై 30న జరిగితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో సతీష్ అతని భార్య సంధ్య, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మృతదేహాల కోసం గోదావరిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఒక మృతదేహం లభ్యంకాగా మిగిలిన మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది.