
జగన్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమ్మఒడి పథకంతో తల్లిదండ్రులకు భరోసా కల్పించామన్నారు. అలాగే రెండేళ్లలో లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం పై కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్ పోస్టుల భర్తీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.