Telugu News » National » Execution if oxygen supply is disrupted delhi high court
ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటే ఉరితీస్తాం: ఢిల్లీ హైకోర్టు
కరోనా కల్లోలం వేళ కొందరు అధికారులు ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటున్నట్లు వస్తున్న ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది. స్థానిక, రాష్ట్ర, కేంద్ర అధికారుల్లో ఎవరైనా ఆక్సిజన్ తరలింపుగానీ, సరఫరాను గానీ అడ్డుకుంటే ఆ వ్యక్తిని ఉరితీస్తాం అంటూ హెచ్చరించింది. తీవ్ర అస్వస్థతకు గురైన కొవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ దొరకడం లేదంటూ మహారాజా అగ్రసేన్ ఆస్పత్రి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా జస్టిస్ విపిన్ సంఘి, జస్టిస్ రేఖా పల్లిలతో కూడిన ధర్మాసనం […]
కరోనా కల్లోలం వేళ కొందరు అధికారులు ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటున్నట్లు వస్తున్న ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది. స్థానిక, రాష్ట్ర, కేంద్ర అధికారుల్లో ఎవరైనా ఆక్సిజన్ తరలింపుగానీ, సరఫరాను గానీ అడ్డుకుంటే ఆ వ్యక్తిని ఉరితీస్తాం అంటూ హెచ్చరించింది. తీవ్ర అస్వస్థతకు గురైన కొవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ దొరకడం లేదంటూ మహారాజా అగ్రసేన్ ఆస్పత్రి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా జస్టిస్ విపిన్ సంఘి, జస్టిస్ రేఖా పల్లిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది.