
ఒక పక్క పెట్రోల్ ధరలు మంటలు పుట్టిస్తుంటే మరోపక్క బైకుల్లోని పెట్రోలు చోరికి గురికావడం ఒంగోలులో అలజడి సృష్టిస్తోంది. దొంగతనాలకు అలవాటు పడిన కొందరు యువకులు ఒంగోలు అన్నవరప్పాడు కాలనీలో పార్క్ చేసిన బైకుల నుంచి పెట్రోలు చోరీ చేస్తున్నారు. సీసీటీవీలో రికార్డయిన చోరీ దృశ్యాలు అందరినీ విస్తుపోయేలా చేస్తున్నాయి. రాత్రి పోలీసుల గస్తీ లేకపోవడంతోనే ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు.