
ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు చక్కబడ్డాకే పదో తరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్రా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకేనే పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షం రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేస్తున్నాయని అలాగని ఏపీలో కూడా పరీక్షలు రద్దు చేయాల్సిన అవసరం ఏముందన్నారు.