
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఏపీ బీజేపీ శాఖ చేపట్టిన సామూహిక మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొన్ని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ డా. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి నుంచి జయంతి వరకు దేశవ్యాప్తంగా 14 రోజుల పాటు చేపట్టిన ఈ కార్యక్రమంలో తప్పకుండా పర్యావరణం పట్ల సమాజంలో చైతన్యం తీసుకువస్తుందని తెలిపారు.