
దేశంలో సీఎంలను మార్చే సంస్కృతి కాంగ్రెస్ కే ఉంది. కానీ ఇప్పుడు అదే వరుసలో బీజేపీ కూడా చేరుతోంది. ఎందుకంటే ఇన్నాళ్లు ముఖ్యమంత్రులను తరచుగా మార్చిన కాంగ్రెస్ కొద్ది కాలంగా మార్పు కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో సీఎంలను మార్చే పద్దతికి స్వస్తి పలికింది. దీంతో ఇప్పుడు కొత్తగా బీజేపీ సైతం అదే దారిలో పయనిస్తోంది. నీతులున్నవి చెప్పడానికే గోతులున్నవి తవ్వడానికే అన్నట్లుగా ఎదుటి వారికి చెప్పడానికైతే ఎన్ని అయినా చెప్పవచ్చు. కానీ మనం పాటించాలంటే కష్టమే మరి.
ప్రస్తుతం దేశంలో రాజకీయాలు మారుతున్నాయి. ఏ పార్టీకైనా తన మనుగడ ముఖ్యమే. దీంతో ఎదుటి వారిని దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో పలు మార్గాలు వెతుకుతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ లో సీఎం మమతా బెనర్జీ ని పదవి నుంచి దించాలనే నెపంతో ఉత్తరాఖండ్ లో నాలుగు నెలల్లో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చిన ఘనత బీజేపీదే. 2017 ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ మూడో ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీకి పగ్గాలు అప్పగించింది.
ప్రస్తుతం రాజకీయాలు మారుతున్నాయి. జాతీయ పార్టీలు సైతం ప్రాంతీయ పార్టీలుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అలాగే అయిపోయిందని చెబుతున్నారు. తాజాగా బీజేపీ సైతం అదే దారిలో పయనిస్తోందని తెలుస్తోంది. ముఖ్యమంత్రులను మార్చుతూ అప్రదిష్టలు తెచ్చుకుంటోందని చెబుతున్నారు. ముఖ్యమంత్రులను మార్చడం ద్వారా పార్టీలో అనైక్యత ఏర్పడుతుందని తెలుస్తోంది.
ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్య నాథ్ ను కూడా మర్చుతారనే ప్రచారంఊపందుకుంది. దీంతో జాతీయ నేతలు అప్రమత్తమైనట్లు సమాచారం. ముఖ్యమంత్రులను మార్చడానికి మాది కాంగ్రెస్ పార్టీ కాదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీఎంకు పదవీ గండం లేదనే విషయం స్పష్టమవుతోంది.