
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బృందం ఢిల్లీకి చేరుకుంది. ఉదయం 11.30 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈటల రాజేందర్ కు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ జడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ, గండర నళిని, ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, అందె బాబయ్య తదితరులు ఉన్నారు.