
చరిత్ర నిర్మాతలు ప్రజలేనని, వ్యక్తులు కాదని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం, ఆత్మగౌరవం ప్రశ్నార్థకంగా మారాయని ఈటల పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ కు డిపాజిట్ రాదని ఈటల అన్నారు. నాయకులను కొనుగోలు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. హుజూరాబాద్ ల కాషాయ జెండా ఎగురబోతోందని ఈటల ఆశాభావం వ్యక్తం చేశారు.