
టీమ్ ఇండియా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ బరిలోకి దిగారు. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో టీమ్ ఇండియా కనిపిస్తోంది. మరి ఓపెనర్లు ఎలాంటి ఆరంభం ఇస్తారో చూడాలి. భారత్ రెండు మార్పులతో భారీలోకి దిగుతోంది. ఉమేశ్ యాదవ్, శార్ధూల్ ఠాకూర్ తుది జట్టులోకి రాగా ఇషాంత్, మహ్మద్ షమికి విశ్రాంతినిచ్చారు. ఈ మ్యాచ్ లోనైనా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను తుది జట్టులోకి తీసుకుంటారని ఆశించినా అదీ జరగలేదు.