https://oktelugu.com/

Jammu and Kashmir: జమ్మూ-కశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్మూ-కశ్మీర్ బారాముల్లా జిల్లాలోని సొపోర్ లో మంగళవారం భద్రతాదళాలు, పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విషయాన్ని కశ్మీర్ పోలీసులు ధ్రువీకరించారు. ఘటనాస్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సొపోర్ లోని పీఠ్ శీర్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదిలికలపై సమాచారం అందుకున్న భద్రతాదళాలు సోమవారం అర్ధరాత్రి కార్డన్ సెర్చ్ ప్రారంభించాయి. ఈ క్రమంలో ముష్కరులు వారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో భద్రతాసిబ్బంది […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : August 24, 2021 / 03:33 PM IST
    Follow us on

    జమ్మూ-కశ్మీర్ బారాముల్లా జిల్లాలోని సొపోర్ లో మంగళవారం భద్రతాదళాలు, పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విషయాన్ని కశ్మీర్ పోలీసులు ధ్రువీకరించారు. ఘటనాస్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సొపోర్ లోని పీఠ్ శీర్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదిలికలపై సమాచారం అందుకున్న భద్రతాదళాలు సోమవారం అర్ధరాత్రి కార్డన్ సెర్చ్ ప్రారంభించాయి. ఈ క్రమంలో ముష్కరులు వారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో భద్రతాసిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు.