
యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో 18 ఏండ్ల బ్రిటిష్ యువసంచలనం ఎమ్మా రెడుకాను చరిత్ర సృష్టించింది. అత్యంత చిన్నవయస్సులోనే గ్రాండ్ స్లామ్ టైటిల్ గెల్చుకుని సత్తా చాటింది. కెనడానకు చెందిన లైలా ఫెర్నాండెజ్ తో జరిగిన ఫైనల్ లో 6-4, 6-3, తేడాతో ఓడించింది. దీంతో 44 ఏండ్ల తర్వాత గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన బ్రిటిష్ మహిళగా రికార్డు సృష్టించింది. మారియా షరపోవా తర్వాత అత్యంత పిన్నవయస్సులో గ్రాండ్ స్టామ్ టైటిల్ గెలుపొందిన టీనేజర్ గా ఎమ్మా నిలిచింది.