దళితబంధుపై రేపు సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. మరో 4 ఎస్సీ రిజర్వ్ డ్ నియోజకవర్గాల్లోని 4 మండలాల్లో అమలు చేయడంపై సననాహక సమావేశం నిర్వహించనున్నారు. మధిర నియోజకవర్గం చింతకాని మండలం, తుంగతుర్తిలోని తిర్మలగిరి, అచ్చంపేట-కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ, జుక్కల్ లోని నిజాంసాగర్ మండలాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.