Durandhar 2 story inspiration : దురంధర్.. ఇది సినిమా కాదు..ప్రతీ భారతీయుడి రివేంజ్. కొంతమంది మినహా మిగతవారంతా కనెక్ట్ అయ్యారంటే.. కొంతమంది కావాలని పనిగట్టుకుని ఈ సినిమాను విమర్శిస్తున్నారంటే.. దాని ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దురంధర్ 2 రిలీజ్ అయిన తర్వాత సంచలనాల మీద సంచలనాలు నమోదవుతున్నాయి. ఈక్రమంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో ప్రధానమైన కథనం ఇదీ.
కొంచెం బలాన్ని చూపిస్తే చాలు..హిందువులు భయపడిపోతారు. మనం ఎంత నష్టమైనా చేయొచ్చు.. దురంధర్ సినిమాలో ఓ డైలాగ్ ఇదీ. ఈ డైలాగ్ ను 2020 నుంచే భారత్ అమలు చేయడం మొదలు పెట్టింది. సర్జికల్ దాడులు, ఆపరేషన్ సిందూర్ వంటి పేర్లతో భారత్ దాడులు చేస్తూనే ఉంది. ఇవన్నీ కూడా అధికారిక మిషన్ లు. కానీ, అనధికారికంగా జరిగేవి చాలా ఉన్నాయి. ఆ ఆపరేషన్ లలో ఊరూపేరూ లేని యోధులు పాల్గొంటున్నారు. వారంతా ఉగ్రవాదులను సినిమాల మాదిరిగా లేపేసినట్టు లేపేస్తున్నారు.
ఆ యోధుల చేతుల్లో చనిపోయిన ఉగ్రవాదులు వీళ్లే
షాహిద్ లతీఫ్.. ఇతడు పఠాన్ కోట్ ఎయిర్ బేస్ దాడిలో కింగ్ పిన్. 2023 అక్టోబర్ సియాల్ కోట్ ప్రాంతంలో జరిగిన దాడిలో కన్నమూశాడు.
రియాజ్..ముంబైనగరంలో జరిగిన దాడులలో ఇతడు కీలకసూత్రధారి. 2023లో పాకిస్థాన్ లో జరిగిన కాల్పుల్లో చనిపోయాడు.
మౌలానా రహీమ్ తారీక్.. ఇతడు మోస్ట్ డేంజరస్ ఉగ్రవాది అజర్ మసూద్ కు అత్యంత సన్నిహితుడు. 2023 నవంబర్ లో కరాచీప్రాంతంలోజరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోయాడు.
జహూర్ ఇబ్రహీం.. ఐసీ 814 విమానం అపహరణలో కీలకపాత్రధారి. 2022లో కరాచీ లో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు.
సలీమ్ రహ్మనీ.. కాశ్మీర్, భారత్ లో జరిగిన అల్లర్లలో కీలకపాత్రధారి. జనవరి,2022లో జరిగిన దాడులలో చనిపోయాడు.
ఖ్వాజా షాహిద్.. భారత ఆర్మీ క్యాంప్ పై జరిగిన దాడిలో ఇతడు ముఖ్యపాత్రధారి. జనవరి,2023లో జరిగిన దాడిలో కన్నమూశాడు.
అక్రమ్ ఖాన్..యువకులను ఉగ్రవాదం వైపు లాగిన వేర్పాటువాది. జనవరి,2023 లో జరిగిన దాడిలో దుర్మరణం చెందాడు.
రజానిజామనీ.. తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించడం లో దిట్ట. 2024లో జరిగిన కాల్పులలో కన్నమూశాడు.
సైఫుల్లా ఖాలిద్.. నగ్రోటా ప్రాంతంలో జరిగిన దాడిలో ఇతడు పాల్గొన్నాడు. 2023లో జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోయాడు.