
ఏరోఇంజిన్ సాంకేతికతలో భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీఓ) మరో ముందడుగు వేసింది. క్లిష్టమైన ఏరో ఇంజన్ భాగాల తయారీలో ఉపయోగించే సమీప ఐసోథర్మల్ ఫోర్జింగ్ టెక్నాటజీని అభివృద్ధి చేసినట్లు సంస్థ ప్రకటించింది. రెండు వేల మెట్రిక్ టన్నుల ఐసోథర్మల్ ఫోర్జ్ హై ప్రెజర్ ను ఉపయోగించి టైటనియం మిశ్రమం నుంచి ఐదు దశల అధిక పీడన కంప్రెసర్ డిస్కులను ఉత్పత్తి చేసినట్లు తెలిపింది. ఏరో ఇంజిన్ సాంకేతికతలో ఇది కీలకమైన ముందడుగని పేర్కొంది. ఈ సంకేతికత కలిగి ఉన్న దేశాల జాబితాలో భారత్ చేరిందని డీఆర్డీవో తెలిపింది.