
ఇకపై ప్రజా సమస్యలు తీర్చేందుకు 24 గంటలూ అందుబాటులో ఉంటానని.. ఇతర రాజకీయాల్లోకి తనని లాగొద్దని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఇక నుంచి రాజకీయపరమైన విషయాలపై ఎటువంటి వ్యాఖ్యలు చేయనని అన్నారు. భువనగిరి, నల్గొండ, పార్లమెంట్ పరిధిలోని ప్రతి గ్రామంలో పర్యటించి సమస్యల పరిష్కరానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా వీలైనంత ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు.