
పోలవరం పనుల పురోగతిపై అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. స్పిల్ వే 42 గేట్లు అమర్చినట్లు సీఎంకు అధికారులు తెలిపారు. ఎగువ కాఫర్ డ్యాం పనులను పూర్తిచేశామన్న అధికారులు.. దిగువ కాఫర్ డ్యాం పనుల పరిస్థితిని వివరించారు. 2022 జూన్ కల్లా రెండు కాల్వలకు లింక్ పనులు పూర్తి కాకాలని, టన్నెల్, లైనింగ్ పనులు పూర్తి చేయాలని సీఎం జగన్ అదేశించారు. ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ పనులపై సీఎం ఆరా తీశారు.